مَا لِلْنِّيَاقِ إِذَا حَدَا جَمَّالُهَا
ఒంటెల కాపరి పాట పాడుతున్నప్పుడు ఆ ఆడ ఒంటెలకు ఏమైంది?
Te
مَا لِلْنِّيَاقِ إِذَا حَدَا جَمَّالُهَا
تَدَعُ الْعَنَاءَ وَلَا تَمَلُّ مَلَالَهَا
ఆ ఒంటెలకేమైంది వాటి పాలకుడు గీతం ఆలపిస్తే?
అవి అలసటను వీడి మార్గమధ్యంలో అలుపెరగక సాగుతున్నాయి.
وَتَرَىٰ لَهَا فِي السَّيْرِ جِدًّا وَاضِحًا
شَوْقًا تَمُدُّ يَمِينَهَا وَشِمَالَهَا
వాటి నడకలో నీవు స్పష్టమైన పట్టుదలను చూడగలవు
విరహ తాపంతో అవి కుడి ఎడమలకు ఊగుతూ సాగుతున్నాయి.
وَتَبَاشَرَتْ لَمَّا أَتَتْ بَدْرًا رَأَتْ
نُورَ النَّبِيِّ الْهَاشِمِيِّ بَدَا لَهَا
అవి బద్ర్ చేరుకొని పరవశించాయి
హషీమీ ప్రవక్త దివ్య కాంతి వాటికి సాక్షాత్కరించినప్పుడు.
غَنِّ لَهَا يَا سَعْدُ بِاسْمِ مُحَمَّدٍ
فَلَعَلَّهَا تُصْغِي لِمَنْ غَنَّىٰ لَهَا
ఓ సాద్! ముహమ్మద్ నామంతో వాటికి గానం చేయి
బహుశా అవి ఆ గాయకుడి స్వరానికి మైమరచి ఆలకిస్తాయేమో.