بَادِرْ لَقَدْ فَاتَتْكَ الْغَنَائِمْ
త్వరపడు! విజయఫలాలు నిన్ను దాటిపోయాయి.
Te
بَادِرْ لَقَدْ فَاتَتْكَ الْغَنَائِمْ
تَقَاسَمُوهَا وَأَنْتَ نَائِمْ
త్వరపడు! నీవు ఆ సంపదలను కోల్పోయావు
నీవు నిద్రిస్తుండగా వారు వాటిని పంచుకున్నారు
وَلَوْ رَأَيْتَ الَّذِينَ فَازُوا
نُحْتَ كَمَا نَاحَتِ الْحَمَائِمْ
విజేతలను నీవు ఒకవేళ చూసి ఉంటే
పావురాల వలె నీవు విలపించే వాడివి
إِنْ رُمْتَ أَلَّا تَكُونَ نَادِمْ
قُمْ لِحَبِيبِ الْقُلُوبِ لَازِمْ
నీవు ఎన్నటికీ పశ్చాత్తాపపడకూడదని ఆశిస్తే
మేల్కొని హృదయ ప్రియుని అంటిపెట్టుకో
وَلَازِمِ الْبَابَ يَا مُعْنَّى
إِنَّ الْسَّعِيدَ الَّذِي يُلَازِمْ
ఓ అలసిన ప్రాణమా! ఆ ద్వారమునే పట్టుకో
పట్టుదలతో ఉండేవారే కదా అదృష్టవంతులు
مَنْ لَازِمَ الْبَابَ نَالَ قُرْبا
وَفَازَ بِالْأَجْرِ وَالْغَنَائِمْ
ద్వారమున వేచియున్నవాడు సామీప్యము పొందును
ఉత్తమ ప్రతిఫలమును మరియు విజయమును పొందును
وَلَا تَنَمْ سَاعَةَ الْتَّجَلِّي
فَلَيْسَ يَحْظَى بِالْأَجْرِ نَائِمْ
దైవ సాక్షాత్కార వేళ నిద్రించకు
నిద్రించేవాడు ఎన్నటికీ ఫలితమును పొందలేడు
قَدْ جَرَحَتْ قَلْبِيَ الْخَطَايَا
وَلَسْتُ أَلْقَى لَهَا مَرَاهِمْ
నా పాపములు నా హృదయమును గాయపరచెను
వాటిని నయం చేసే ఔషధమే కనబడదు
سِوَى الْرِّضَا مِنْكَ يَا إِلَهِي
يَا وَاسِعَ الْجُودِ وَالْمَكَارِمْ
ఓ ప్రభూ! నీ ప్రసన్నత తప్ప వేరే మార్గం లేదు
ఓ అపార దాతృత్వము మరియు కృప గలవాడా!
وَقَدْ تَوَسَّلْنَا يَا إِلَهِي
بِسَيِّدِ الْعَرَبِ وَالْأَعَاجِمْ
ఓ ప్రభూ! మేము నీ సామీప్యము వేడుకొంటున్నాము
అరబ్బులు మరియు అరబ్బేతరుల నాయకుని ద్వారా
نَبِيِّنَا الْمُصْطَفَى الْتِّهَامِي
مَنْ جَاءَ لِلْأَنْبِيَاءِ خَاتَمْ
మా ప్రవక్త, ముస్తఫా, తిహమీ గారు
సకల ప్రవక్తలలో అంతిమ ప్రవక్తగా వచ్చినవారు